రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు, ముహూర్తం- వీరికి లేనట్లే..చెక్ చేసుకోండి..!! | PM Kisan 21st Installment Status | PM Kisan 2000 Funds Release Check Link | @pmkisan.org.in
రైతులకు నిజంగా ఇది పండుగ శుభవార్తే. ముఖ్యంగా దీపావళి ముందు తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయంటే ఆ ఆనందమే వేరు! కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు (PM Kisan Funds) విడుదలపై తాజా అప్‌డేట్ వచ్చేసింది. 21వ విడత నిధులను ఈ నెల 18 లేదా 19వ తేదీన రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా దీపావళి పండుగకు కానుకగా విడుదల చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేంద్రం నుంచి ఈ కీలక ప్రకటన వెలువడడంతో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇవ్వాల్సిన నిధులను కూడా పీఎం కిసాన్ నిధులతో పాటే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆగస్టు 2న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు కలిపి ఒకేసారి ఒక్కో రైతు ఖాతాలో రూ. 7 వేలు జమ అయ్యాయి. ఈసారి కూడా అలాంటి శుభవార్తను ఆశిద్దాం.
నిబంధనలు పాటించని వారికి ఈసారి నిధులు కట్!
అయితే, ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం ఉంది. ప్రతిసారీ నిధులు విడుదలైనప్పుడు లక్షల సంఖ్యలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు. ఉదాహరణకు, గత విడతలో ఏపీలో అర్హత కలిగిన 40.78 లక్షల మందిలో కేవలం 40.77 లక్షల మందికే నిధులు అందాయి. అలాగే, తెలంగాణలో 30.69 లక్షల మంది అర్హుల్లో 30.62 లక్షల మందికే నగదు జమ అయ్యింది. అంటే, లెక్క ప్రకారం కొన్ని వేల మంది రైతులు డబ్బులు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే… ఈకేవైసీ (e-KYC) పూర్తి చేయకపోవడమే!
అధికారులు పదేపదే హెచ్చరించినా చాలా మంది రైతులు ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ కాకపోయినా, బ్యాంకింగ్ వివరాలు సరిగా లేకపోయినా నిధుల జమలో సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ నెల 18న నిధులు విడుదల కాకముందే, రైతులందరూ వెంటనే తమ అర్హతను చెక్ చేసుకోవాలని అధికారులు బలంగా సూచిస్తున్నారు.
అర్హతను ఇలా చెక్ చేసుకోండి!
మీరు బెనిఫిషరీ లిస్ట్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా సులభం.
- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) లోకి వెళ్లండి.
- ‘ఫార్మర్ కార్నర్’ (Farmer’s Corner) లోని ‘బెనిఫిషరీ స్టేటస్’ (Beneficiary Status) ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వివరాలు చూడండి.
- అక్కడ ‘e-KYC Status’ దగ్గర ‘Yes’ అని ఉంటేనే మీకు ఈసారి పీఎం కిసాన్ 21వ విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఈ-కేవైసీ కాకపోయి ఉంటే, దాన్ని పూర్తి చేయడానికి చివరి అవకాశంగా భావించి వెంటనే పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా లేదా పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. గుర్తుంచుకోండి, నిబంధనలు పాటించిన రైతుల ఖాతాల్లోకి మాత్రమే ఈసారి పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. చిన్నపాటి పొరపాటు కారణంగా రూ. 2000 కోల్పోవద్దు!