బిగ్ బ్రేకింగ్: తల్లికి వందనం ₹363 కోట్ల పెండింగ్ నిధులు విడుదల.. ఈ వారమే తల్లుల ఖాతాల్లో జమ!

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

💥 బిగ్ బ్రేకింగ్: తల్లికి వందనం ₹363 కోట్ల పెండింగ్ నిధులు విడుదల.. ఈ వారమే తల్లుల ఖాతాల్లో జమ! | Thalliki Vandanam Pending Payment Update

తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదలపై ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ అందుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాల్లో ఇది ఒకటి. ఇందులో భాగంగా జూన్ నెలలోనే అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, అర్హత ఉండి కూడా నిధులు అందని తల్లుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం 2.79 లక్షల మందికి పైగా తల్లులకు సంబంధించిన తల్లికి వందనం పెండింగ్ నిధులు ఇంకా విడుదల కాక ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న ఆ నిధుల చెల్లింపు ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కూటమి ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.13 వేలు జమ చేసింది. జూన్‌లో మొత్తం 63,77,898 మంది విద్యార్థులకు సంబంధించి రూ.8291.27 కోట్ల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కానీ, వేర్వేరు కారణాల వల్ల కొంతమంది తల్లుల ఖాతాల్లో నిధుల జమ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. అందుకే వీరంతా గ్రామ/వార్డు సచివాలయాల్లో గ్రీవెన్సుల ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.

Union Bank RSETI Free Training Courses
Free Training Courses: గ్రామీణ మహిళలకు గోల్డెన్‌ ఛాన్స్.. ఫ్రీ గా ఈ స్కిల్స్ నేర్చుకుని ఇంట్లోనే సంపాదించవచ్చు.

ఈ విధంగా గ్రీవెన్సులో దరఖాస్తు చేసుకున్న వారిలో 2,79,720 మంది తల్లులకు సంబంధించి రూ.363.64 కోట్ల నిధులు విడుదలకు దాదాపు రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మొత్తం చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ, సచివాలయాల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్సులో దరఖాస్తు చేసిన తల్లులకు ఇంతవరకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు జమ కాకపోవడానికి ప్రధాన కారణాలను అధికారులు వివరిస్తున్నారు. విద్యార్థుల వివరాల నమోదులో అంటే ‘చైల్డ్‌ ఇన్‌ఫో’లో సాంకేతికంగా చిన్నపాటి తప్పు దొర్లినా నిధులు జమ కాలేదని అంటున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్‌ నెంబర్లు చెల్లుబాటులో ఉండాలి. అలాగే, సరాసరి నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగం ఉండకూడదు. ఆదాయం పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఎక్కువమంది తల్లులు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం పరిమితి కారణంగానే అనర్హులుగా నిలిచారని అధికారులు స్పష్టం చేశారు.

Indira Dairy Scheme 70 Percent Subsidy Details Telugu
70% సబ్సిడీతో ఇందిరా డెయిరీ పథకం: మహిళలకు నెలకు ₹40,000 ఆదాయం!

ఇదిలా ఉండగా, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కొంతమంది తల్లుల ఖాతాల్లో రూ.7 వేలు, రూ.8 వేలు, రూ.9 వేలు వంటి వేర్వేరు మొత్తాలు జమ అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం వీరి తల్లికి వందనం పెండింగ్ నిధులు విషయం పైన కూడా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తానికి, 2.79 లక్షల మంది తల్లులకు సంబంధించిన తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల దిశగా ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం పెండింగ్ నిధులు అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉంది.

Bajaj Pulsar 25th Anniversary Offer Details Telugu
Bajaj Pulsar Offer: బజాజ్ అదిరిపోయే గిఫ్ట్.. పల్సర్ బైక్‌పై భారీ తగ్గింపు, అద్భుతమైన ఆఫర్ మిస్ అవ్వకండి!
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp