సామాన్యులకు శుభవార్త.. 147 వస్తువులపై జీఎస్టీ జీరో! | New GST Rates 2025 Zero Tax Items Full List
📢 New GST Rates 2025 పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై పన్నుల భారం తగ్గించేందుకు వస్తు సేవల పన్ను (GST) రేట్లను పూర్తిగా మార్చింది. తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో 147 వస్తువులపై జీఎస్టీ పూర్తిగా జీరోగా అమలు చేశారు.
ఇకపై పాలు, పెరుగు, తేనె, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, విద్యుత్ మొదలైన వస్తువులపై ఒక్క పైసా పన్ను కూడా ఉండదు. దీంతో సాధారణ కుటుంబాలకు ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.

కొత్త జీఎస్టీ స్లాబుల మార్పులు
ఇప్పటివరకు ఉన్న 12% మరియు 28% జీఎస్టీ స్లాబులను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం కేవలం 5% మరియు 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉన్నాయి. అయితే, సైన్ గూడ్స్, లగ్జరీ ఉత్పత్తులపై కొత్తగా 40% పన్ను స్లాబును అమలు చేశారు. కానీ, వాటిపై ఉన్న సెస్‌ను తొలగించారు.
దీంతో సాధారణంగా వినియోగించే రోజువారీ వస్తువులు, ముఖ్యంగా ఆహార పదార్థాలు, సేంద్రియ ఉత్పత్తులు మరింత చవకగా లభించనున్నాయి.

🥗 Food Items – జీరో జీఎస్టీ వస్తువులు
కేటగిరీ | వస్తువులు |
---|---|
పాలు & పాల ఉత్పత్తులు | తాజా పాలు, పాశ్చరైజ్డ్ మిల్క్, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్, పనీర్ (బ్రాండ్ లేని), సహజ తేనె |
తాజా కూరగాయలు | ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యారెట్లు, ముల్లంగి, కీరదోస, కాకర, చిక్కుడు |
తాజా పండ్లు | అరటి, ఖర్జూరం, అంజీర్, మామిడి, జామ, నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష, బొప్పాయి, యాపిల్, చెర్రీలు, స్ట్రాబెర్రీలు, సీతాఫలం, ధానిమ్మ, లిచి |
ధాన్యాలు & పిండి | గోధుమలు, మెస్లిన్, మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, బార్లీ, ఓట్స్, బక్వీట్, మిల్లెట్, ప్యాక్ చేయని పిండి |
పప్పులు & గింజలు | శనగలు, మినపగింజలు, పల్లీలు, సోయాబీన్స్, అవిసె గింజలు, నువ్వులు, సూర్యకాంతి గింజలు, గసగసాలు, మామిడి గింజలు |
సుగంధ ద్రవ్యాలు | జిలకర్ర, కొత్తిమీర విత్తనాలు, సోంపు, బాడియన్, అజ్వైన్, జునిపెర్ బెర్రీలు |
ప్రాసెస్ చేయని ఉత్పత్తులు | తాజా అల్లం, పసుపు, పచ్చి కాఫీ గింజలు, గ్రీన్ టీ ఆకులు, చింతపండు, మామిడి పొడి |
మాంసం & చేపలు | తాజా గోవు మాంసం, గొర్రె మాంసం, పంది మాంసం, కోడి మాంసం, చేపలు, ఫిష్ ఫిల్లెట్లు, రొయ్యలు, క్రస్టేసియన్లు |
సేంద్రియ ఉత్పత్తులు | బ్రాండ్ లేని బ్రెడ్, వెయించని అప్పడాలు, మురి, ఖోయ్, ముర్కి |
ప్రాథమిక అవసరాలు | ఉప్పు, నీరు (మినరల్ వాటర్ తప్ప), కొబ్బరి నీళ్లు, బెల్లం, పామిరా బెల్లం |
🛒 Non-Food Items – జీరో జీఎస్టీ వస్తువులు
కేటగిరీ | వస్తువులు |
---|---|
వ్యవసాయ సంబంధితవి | పశుగ్రాసం, గడ్డి, లూసర్న్, క్లోవర్, పశువుల మేత విత్తనాలు, తృణధాన్యాల పొట్టు |
ఎనర్జీ & ఇంధనం | విద్యుత్ (Electricity), ఫైర్‌వుడ్, చెక్క బొగ్గు |
ప్రింట్ మెటీరియల్ | పుస్తకాలు, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్, జర్నల్స్, కలరింగ్ బుక్స్, మ్యాప్స్ |
సాంప్రదాయ వస్తువులు | గాంధీ టోపీ, ఖాదీ నూలు, చేతితో చేసిన చీపుర్లు, మట్టి దీపాలు |
పూజా సామగ్రి | రుద్రాక్ష, తులసి కంఠి, పవిత్ర దారం, చెక్క ఖడౌ, విభూతి, దీప వత్తులు |
హెల్త్ & ఫ్యామిలీ | కండోమ్స్, గర్భనిరోధకాలు, వినికిడి పరికరాలు |
ప్రభుత్వ & ఆర్థిక | రుపాయి నోట్లు, స్టాంప్ పేపర్లు, పోస్టల్ వస్తువులు, జాతీయ పతాకం |
ఇకపై ఈ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో జీరో జీఎస్టీ (Zero GST) మాత్రమే వర్తిస్తుంది. దుకాణదారులు పాత రేట్లను వసూలు చేసే అవకాశం ఉన్నందున వినియోగదారులు తప్పనిసరిగా GST రేట్లను బిల్లులో చెక్ చేయాలి.
ప్రజలకు కలిగే లాభం
కొత్త జీఎస్టీ రేట్ల వల్ల:
- కిరాణా ఖర్చులు తగ్గుతాయి
- కూరగాయలు, పండ్లు మరింత చవక అవుతాయి
- పుస్తకాలు, ఎడ్యుకేషన్ మెటీరియల్ జీఎస్టీ నుంచి మినహాయింపు
- వ్యవసాయం, పశుగ్రాసం, పశువులపై భారం తగ్గింపు
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులకు పెద్ద ఉపశమనం లభించనుంది.